News
భట్టి విక్రమార్కతో గద్దర్ భేటి
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతో భేటి అయ్యారు తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్న నేపధ్యంలో, దాన్ని సాధించే దిశగా తెలంగాణలో మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణను వ్యతిరేకించిన శక్తులు ప్రభుత్వంలో కొనసాగడం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వంలో నిరాదరణకు గురైన సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చి ఉద్యమం చేయాలనే విషయం భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధకాండ, విమలక్క అరెస్ట్, అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ హామీని గద్దర్ భట్టి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేసీఆర్ సాగిస్తున్న పాలనపై కాంగ్రెస్ ప్రశ్నించడంలో జరుగుతన్న వైఫల్యాలను గద్దర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మర్చుకోవాలని సూచించనట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా మౌనంగా ఉన్న గద్దర్ ఇప్పుడు కాంగ్రెస్ నేత భట్టిని కలవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్రంలో మరో ప్రజా ఉద్యమం రానుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








